మూడో విడత పోలింగ్ ముగింపు.. నంబర్ వన్‌లో బెంగాల్!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్లో 79శాతం నమోదవ్వడం రికార్డ్ బ్రేక్ చేసినట్లేనని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్క రోజే దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓటు ఎవరికి వేసినా బీజేపీకే పడుతోందని సంచలన ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే స్వయానా ఇలా శశిథరూర్, అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది. బూత్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడు. మరికొన్నిచోట్ల బీజేపీ- టీఎంసీ కార్యకర్తలు కొట్టుకున్నారు.
ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగాయ్..!
దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.
నమోదైన పోలింగ్ శాతాలివీ..
అసోం - 74.05
బిహార్ - 54.95
ఛత్తీస్‌గఢ్ - 64.03
గోవా - 70.96
గుజరాత్ - 58.81
జమ్ము కశ్మీర్ - 12.46
కర్ణాటక - 60.87
కేరళ - 68.62
మహారాష్ట్ర - 55.05
ఒడిశా - 57.84
త్రిపుర - 71.13
ఉత్తర్‌ప్రదేశ్ - 56.36
పశ్చిమ బెంగాల్ - 78.94
దాద్రానగర్ హవేలి - 71.43
డామన్ డయ్యూ - 65.34
కాగా.. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది.. మూడో విడతలో నమోదైన పోలింగ్ ప్రకారం కోల్‌కతా మొదటి స్థానంలో ఉండగా.. అసోం, దాద్రానగర్ హవేలి, త్రిపుర, గోవా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments