‘మా’ అధ్యక్షుడిగా బెనర్జీ.. కారణమదే!!
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా వీకే నరేష్ స్థానంలో బెనర్జీ నియమితుడయ్యాడు. ప్రస్తుత ప్రెసిడెంట్ నరేశ్ షూటింగ్స్ నిమిత్తం 41 రోజుల పాటు సెలవు పెట్టాడు. ఈ కారణంగా డిసిప్లినరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి చర్చించారు. నియమాల ప్రకారం యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన మీటింగ్‌లో చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధతో పాటు బెనర్జీ, జీవితా రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు.
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్ వీకేపై కొద్దికాలంలోనే సభ్యల నుండి వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా ఆయన ప్యానెల్ నుండి జనరల్ సెక్రటరీగాఎన్నికైన జీవితా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజశేఖర్ ఇతరులు కొంత మంది నరేశ్ పనితీరుని తప్పుపట్టారు. ఆ క్రమంలో ‘మా’లో చాలా గొడవలే జరిగాయి. ముఖ్యంగా జీవిత, రాజశేఖర్‌లు నరేశ్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ తదితరులు రంగంలోకి దిగారు. మా డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ వివాదాస్పదంగా వ్యవహరించడంతో క్రమశిక్షణా సంఘం అతనిపై చర్యలు తీసుకోవాలనుకోవడం.. రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments