నాలోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసిన‌ స్పీడున్నోడు అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం. - హీరో బెల్లంకొండ శ్రీనివాస్

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

అల్లుడు శీను చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే విజయం సాధించిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 3. ఈ సంద‌ర్భంగా స్పీడున్నోడు సినిమా గురించి బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం...

మంచి సినిమా కోస‌మే గ్యాప్...

నా మొద‌టి సినిమా అల్లుడు శీను త‌ర్వాత రెండో సినిమాకి కొంత గ్యాప్ వ‌చ్చింది. ఏదో సినిమా చేసేయాల‌నుకోవ‌డం లేదు. గ్యాప్ వ‌చ్చిన ఫ‌ర‌వాలేదు మంచి సినిమా చేయాల‌నుకుంటున్నాను. అందుచేతే అల్లుడు శీను కి, స్పీడున్నోడుకి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఇక నుంచి గ్యాప్ లేకుండా సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

స్పీడున్నోడు లో మార్పులు..

త‌మిళంలో విజ‌యం సాధించిన సుంద‌రపాండ్య‌న్ సినిమాకి రీమేక్ గా స్పీడున్నోడు రూపొందుతుంది. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు స్పీడున్నోడు స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేసారు. భీమ‌నేని శ్రీనివాస‌రావు గారు తెర‌కెక్కించిన సుస్వాగ‌తం సినిమా చూసి ఇంటికి వెళ్లిన త‌ర్వాత కూడా ఎలా ఆ సినిమా గురించి ఆలోచిస్తామో...అలా ఈ సినిమా చూసిన త‌ర్వాత కూడా ఆలోచిస్తాం. మంచి స్ర్కిప్ట్ కాబ‌ట్టే రీమేక్ అయిన ఓకె అన్నాను. నా ఫ‌స్ట్ మూవీ అల్లుడు శీను కంటే 10 రెట్లు ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డాను. అలాగే ఈ సినిమాలో ఫ‌ర్ ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది. నాలోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసిన‌ స్పీడున్నోడు ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం.

టైటిల్ సెంటిమెంట్.

భీమ‌నేని శ్రీనివాస‌రావు గారు సినిమాలు ఎక్కువుగా ఎస్ అనే ఇంగ్లీషు అక్ష‌రంతో ప్రారంభ‌మ‌వుతాయి. అందుచేత ఈ సినిమాకి ఎస్ అనే ఇంగ్లీషు అక్ష‌రంతో స్టార్ట్ అయ్యేలా స్పీడున్నోడు అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నాన్న‌గారు, డైరెక్ట‌ర్ భీమ‌నేని గారు డిష్క‌స్ చేసి ఈ టైటిల్ ఫిక్స్ చేసారు. అల్లుడు శీను లో ఐటం సాంగ్ చేసిన త‌మ‌న్నా తో స్పీడున్నోడు లో కూడా ఐటం సాంగ్ ప్లాన్ చేసాం.

ఫిబ్ర‌వ‌రి 5 విడుద‌ల‌

ఒక పాట‌, రెండు రోజులు టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన సాంగ్, టాకీ పూర్తి చేయ‌నున్నాం. సంక్రాంతి సంద‌ర్భంగా స్పీడున్నోడు థియేట‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఆత‌ర్వాత ఈనెల 16న ఆడియో, ఫిబ్ర‌వ‌రి 5న సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

బోయ‌పాటితో సినిమా

స్పీడున్నోడు త‌ర్వాత బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, ఒక లైలా కోసం చిత్రాల డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాను.