అభిమాని కోసం ఫ్యామిలీతో కర్నూల్ వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్!
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో సాలిడ్ ఇంపాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే తన హార్డ్ వర్క్ తో మాస్ ప్రేక్షకుల్లో శ్రీనివాస్ కొంతవరకు సక్సెస్ అయ్యాడు. తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చే సరైన హిట్ కోసం శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. మంచి పొటెన్షియల్ ఉన్న నటుడిగా శ్రీనివాస్ కు గుర్తింపు ఉంది.
ముందుగా చెప్పుకున్నట్లుగా మాస్ లో శ్రీనివాస్ కు కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా శ్రీనివాస్ తన అభిమానికి జీవితాంతం గుర్తుండి పోయేలా సర్ ప్రైజ్ ఇచ్చాడు. కర్నూల్ కు చెందిన బెల్లంకొండ శ్రీనివాస్ అభిమాని ఇటీవలే కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. గృహప్రవేశంకు రావాల్సిందిగా శ్రీనివాస్ ని ఆహ్వానించాడు.
తన అభిమాని కోరిక తీర్చాలి అనుకున్న శ్రీనివాస్ అతడిని సుర్ ప్రైజ్ చేశాడు. కేవలం తానొక్కడే కాదు తన ఫ్యామిలీని కూడా అభిమాని కొత్త ఇంటి గృహప్రవేశానికి తీసుకువెళ్లాడు శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు బెల్లంకొండ సురేష్, సాయి గణేష్, పద్మ హాజరయ్యారు. దీనితో ఆ అభిమాని సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమానికి కొన్ని కానుకలు బహుకరించినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments