నితిన్ ప్లేస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో విజయవంతమైన `రాక్షసన్` సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయడానికి హక్కులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు నితిన్ చేతుల నుండి ఆ ప్రాజెక్ట్ చేతులు మారిందట. వివరాల ప్రకారం ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్‌లో నటించే అవకాశాలున్నాయి. తేజ, శ్రీనివాస్ సినిమా పూర్తి కావచ్చింది.
ఇది పూర్తి కాగానే.. శ్రీనివాస్ అనీల్ సుంకర, వంశీకృష్ణతో కలిసి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటించబోతున్నాడు. అలాగే మరో వైపు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా, రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాట్ట. మరి ఈ గ్యాప్‌లో రీమేక్‌లో ఎప్పుడు నటిస్తాడో తెలియదు. లేదా రమేష్ వర్మ, అజయ్ భూపతిల్లో ఎవరైనా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారో తెలియదు. త్వరలోనే సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments