బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ బీచ్ ఫెస్టివల్ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం. బీచ్ ఫెస్టివల్ నేపధ్యంలో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ ఎనర్జిటిక్ నెంబర్ ను పిక్చరైజ్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ ఈ ఎనర్జిటిక్ అండ్ రోమాంటిక్ బీచ్ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది.
ఈ పాట చిత్రీకరణ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. "ఏ విషయంలోనూ రాజీపడకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇప్పుడు ఒక బీచ్ సాంగ్ కోసం వైజాగ్ లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ భారీ సెట్ ను నిర్మించాం. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల కాంబినేషన్ లో ఈ పాటను చిత్రీకరించనున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com