బోయపాటి మాస్ మార్క్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్బ్ లుక్ !!
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. బోయపాటి సినిమా తరహా మాస్ యాంగిల్ ఎక్కడా కనిపించకుండా.. చాలా క్యూట్ గా ఉన్న ఫస్ట్ లుక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఆ లోటును తీర్చేందుకు నేడు సినిమాలోని బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్న ఈ తాజా పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఎనర్జటిక్ గా మాస్ లుక్ తో అదరగొడుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments