బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'సాక్ష్యం' పూర్తికావస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది.
ఈ క్రమంలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం నేడు ప్రారంభమైనది. ఫైట్ మాస్టర్ స్టంట్ శివ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సారి కొత్త దర్శకుడైన శ్రీనివాస్ తో చిత్రం చేయడం విశేషం. విజయవంత చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం శ్రీనివాస్ కు ఉంది. సీనియర్ రచయిత అబ్బూరి రవి మాటలు అందించారు. నవీన్ సొంటినేని (నాని) నిర్మాతగా వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
“బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రొఫెషనలిజం ఉన్న హీరో, బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్న అతని ప్యాషన్, కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్. దర్శకుడు శ్రీనివాస్ ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు, వారెవరన్నది త్వరలో వెల్లడిస్తాము. రచయిత అబ్బూరి రవి, ఛాయాగ్రహకుడు చోట కె నాయుడు మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. స్టంట్ శివ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశ చిత్రకరణతో నేడు చిత్ర షూటింగ్ ప్రారంభమైనది," అన్నారు నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments