బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
- IndiaGlitz, [Tuesday,August 13 2019]
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా విడుదలైన 'రాక్షసుడు' చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విజయం గురించి హీరో తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ప్రెస్‌మీట్‌ను కండెక్ట్ చేశారు. అందులో మాట్లాుడతూ కొడుకు పెళ్లి గురించిన ప్రస్తావన చేశారు.
సాయిశ్రీనివాస్‌కి ఇండస్ట్రీలోని అమ్మాయిని కాకుండా బయట కుటుంబానికి చెందిన అమ్మాయిని చూస్తున్నామని, మంచి సంబంధం కుదరగానే పెళ్లి చేయాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఈయన సాయిశ్రీనివాస్ తదుపరి సినిమా గురించి కూడా మాట్లాడుతూ 'రాక్షసుడు' సక్సెస్ తర్వాత తొందరపడాలనుకోవడం లేదని, మంచి కథ కుదిరిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని తర్వాతే సెట్స్ పైకి వెళతామని ఆయన తెలిపారు.