భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న బెల్లంకొండ?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఐదేళ్ల పాటు భారీ సినిమాలే చేశాడు. సక్సెస్ రాకపోయినప్పటికీ గుర్తింపు మాత్రం బాగానే దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈ యువ హీరో కాన్సెప్ట్‌ను నమ్ముకుని చేసిన సినిమా `రాక్షసుడు`తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీనివాస్ తదుపరి సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ హీరో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్.
రీసెంట్గా ఓ డైరెక్టర్ సాయి శ్రీనివాస్‌ను కలిసి కథను చెబితే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట. అందుకు కారణం ఈ హీరోకి హిందీ యూ ట్యూబ్ మార్కెట్ 6-7 కోట్ల రూపాయలే ఉందట. ఇక థియేట్రికల్ రైట్స్ 4-5 కోట్ల రూపాయలను తీసుకున్నా సేఫ్ బిజినెస్ అవుతుందట. అయితే అంత వరకు బాగానే ఉన్నా... సాయిశ్రీనివాస్‌కు అంత భారీ రెమ్యునరేషన్ అంటేనే నిర్మాతలు ఆలోచనలో పడతారు. 5-6 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే సరిపోతుంది. ఈ హీరోకి మంచి డిమాండ్ కూడా ఏర్పడుతుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments