పొల్లాచిలో బెల్లంకొండ శ్రీనివాస్ సాహసాలు!!
Send us your feedback to audioarticles@vaarta.com
"డిక్టేటర్" వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "బలమైన కథ-కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4గా శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ అయ్యాయి. తాజాగా పొల్లాచిలో 15 రోజుల భారీ షెడ్యూల్ లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను పిక్చరైజ్ చేశాం. అందుకోసం మా ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ గారి సారధ్యంలో విండ్ టర్బైన్స్ తో కలిపి ఓ భారీ సెట్ ను రూపొందించాం. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్నాడు. ఈ భారీ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి కీలకం" అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments