బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్...

  • IndiaGlitz, [Friday,December 11 2015]

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం సుంద‌ర‌పాండ్య‌న్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి స్పీడున్నోడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. అల్లుడు శీను త‌ర్వాత శ్రీనివాస్ బోయపాటి సినిమా చేయాల్సింది కానీ కొన్ని కార‌ణాలతో సినిమా ఆగిపోవ‌డం, శ్రీనివాస్ రీమేక్ సినిమాలో న‌టించ‌డం జ‌రిపోయాయి. ఈ సినిమా కూడా చాలా గ్యాప్ తీసుకుని విడుదల అవుతుంది. మరి తొలి చిత్రంతో సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ ఈ చిత్రంతో మరో సక్సెస్ అందుకుంటాడా..చూద్దాం...