బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1

  • IndiaGlitz, [Tuesday,February 20 2018]

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. "ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. "దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్" లాంటి సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాగారిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే మిగతా నటీనటుల మరియు సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 22న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి శాంతయ్య, నిర్మాత: నవీన్ సొంటినేని (నాని), నిర్మాణం: వంశధార క్రియేషన్స్, దర్శకత్వం: శ్రీనివాస్.

More News

మార్చి మొదటి వారంలో 'యుద్ధభూమి'

1971 లో భార‌త స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన చిత్రం '1971 బియాండ్ బార్డ‌ర్స్'. మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో  విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్నిజాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్,  శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి అనువ‌దిస్తున్నార

అభిమానుల సమక్షంలో ఘనంగా విజయనిర్మల 73వ జన్మదిన వేడుకలు

సీనియర్ నటీమణి,దర్శకురాలు,నిర్మాత,గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారు నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు.

హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ వి.ఐ. ఆనంద్

విభిన్నమైన సినిమాలతో ఆయన ప్రయాణం..కొత్త కథలే ఆయన ప్రయత్నం..

హిజ్రా పాత్రలో అనుష్క హీరో...

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన చిత్రాల్లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన 'భాగమతి' ఒకటి.

రెజీనా బాలీవుడ్ ఎంట్రీ

దక్షిణాది హీరోయిన్ లు బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు.