మరో తమిళ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..
Send us your feedback to audioarticles@vaarta.com
2019లో ధనుష్ ప్రధాన పాత్రలో రూపొంది.. మంచి సక్సెస్ సాధించిన తమిళ చిత్రం 'రాక్షసన్'ను తెలుగులోకి 'రాక్షసుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేసి ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ తరువాతి రెండు సినిమాలు కూడా రీమేక్సే కావడం విశేషం. ఇక ఈ యంగ్ హీరో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లోకి ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
‘ఛత్రపతి’ సినిమా రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ సెట్ సైతం వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో తమిళ రీమేక్‌లో నటించడానికి సన్నద్ధమవుతున్నట్లు తమిళ చిత్ర సీమ సమాచారం. వివరాల్లోకి వెళితే, ధనుశ్ హీరోగా నటించిన 'కర్ణన్' సినిమా ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారట. త్వరలోనే తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మంచి యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమాను చూసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఫిదా అయిపోయాడట. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తమిళంలో 'కర్ణన్' చిత్రాన్ని మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments