ఇంట్రెస్టింగ్ గా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కవచం - బెల్లంకొండ సాయి శ్రీనివాస
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళని దర్శకుడిగా పరిచయం చేస్తూ నవ, యువ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని ) రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం కవచం. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతమ్ అందిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది.
ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా 'కవచం' టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ చోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు తమన్, చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ, కళా దర్శకుడు చిన్న, ఎడిటర్ చోట కె. ప్రసాద్, రచయిత కేశవ్ పప్పల, చీఫ్ కో- డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి, సహ నిర్మాత చాగంటి శాంతయ్య పాల్గొన్నారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ బేస్డ్ మూవీ చెయ్యాలని ఒక 50 కథలు విన్నాను. అందులో శ్రీనివాస్ చెప్పిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎంటర్ టైన్మెంట్ తో పాటు కథ కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ మూవీ నచ్చుతుంది. ఇలాంటి ఒక మంచి మూవీని న్నాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ కి నా థాంక్స్. కొత్త డైరెక్టర్ లా కాకుండా ఎక్స్ పీరియన్స్ వున్న డైరెక్టర్ లా తీశారు. సినిమా చూసాక నేనే సర్ప్రైజ్ అయ్యాను. థమన్ మంచి సాంగ్స్ ఇచ్చారు. చోట గారు నా ఫస్ట్ మూవీ కి వర్క్ చేసారు.
మళ్ళీ ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. నాతో సినిమా తియ్యాలని నిర్మాత నాని ఎప్పటినుండో వైట్ చేస్తున్నాడు. అతను ఇంత మంచి సినిమా చేయటం చాలా హ్యాపీగా వుంది. కాజల్ న ఫెవరెట్ యాక్ట్రెస్. ఆమెతో ఇంకా రెండు మూవీస్ చేస్తున్నాను. మెహ్రీన్ ఒక కీ రోల్ లో నటించింది. చాలెంజింగ్ గా తీసుకుని ఆ పాత్ర చేసింది. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ నా థాంక్స్ అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుటూ... నన్ను నమ్మి నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేష్ గారికి మా హీరో సాయి కి నా స్పెషల్ థాంక్స్. అలాగే మా నిర్మాత నాని, శాంతయ్య గారికి నా థాంక్స్. చోటా కె. నాయుడు గారితో ఈ సినిమాకి వర్క్ చేయడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. రెగ్యులర్ ఫిలింలా కాకుండా క్రొత్త జోనర్లో చాలా కొత్తగా ఈ చిత్రం ఉంటుంది. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి నా థాంక్స్. మా హీరో, నిర్మాత, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కాన్ఫిడెంట్ గా చెపుతున్నాను... అన్నారు.
నిర్మాత నవీన్ శొంఠినేని (నాని) మాట్లాడుతూ.. సింగిల్ సిట్టింగ్ లో కథ ఒకే చేసి మాకు సినిమా చేసిన హీరో సాయికి నా థాంక్స్. కాజల్, మెహ్రీన్ యిద్దరూ కథ విని బాగా ఎక్సయిట్ అయి ఈ సినిమా చేసారు. యూనిట్ అంతా కస్టపడి ఒక మంచి సినిమా చేసారు. ముఖ్యంగా మా శాంతయ్య గారు ఈ ప్రొడక్షన్ అంతా దెగ్గరుండీ చూసుకొని షూటింగ్ చేసారు. థమన్ ది బెస్ట్ సాంగ్స్, ఆర్ ఆర్ ఇచ్చారు. మా డైరెక్టర్ తో ఎన్ని సినిమాలైనా చేయడానికి నేను రెడీ. సినిమా రిలీజ్ తర్వాత మా సినిమానే మాట్లాడుతుంది... అన్నారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్టు. ఎంటర్టైన్ మెంట్ తో సాగె థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఫిలిం. స్టోరీ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నిజంగా వెరీ ఇంటిలిజెంట్ మూవీ ఇది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్నా క్యారెక్టర్ లో నటించాను. సాయి అమేజింగ్ టాలెంట్ వున్న హీరో. లవ్లీ వర్కింగ్ విత్ డైరెక్టర్ శ్రీనివాస్. చాలా అందంగా ఈ చిత్రాన్ని తీశారు... అన్నారు.
మెహ్రీన్ మాట్లాడుటూ.. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ని కలిగించింది... అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments