బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయక' సినిమాలతో పలకరించాడు. ఇవేవీ ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయాయి. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాక్ష్యం'లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా, నాని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారని ఆ మధ్య మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలలో ఎంతమాత్రం నిజంలేదని తెలుస్తోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్నారని తాజా సమాచారం.
ఇందులో శ్రీనివాస్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రం ఈ నెల 23న ప్రారంభం కానుందని.. మార్చి 2 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మల్టీ డైమెన్షన్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించనుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటరుగా పనిచేయనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments