ఆలోచనలో పడ్డ బెల్లంకొండ హీరో!!
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘రభస’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాననే నమ్మకంగా ఉన్న శ్రీనివాస్ రానున్న సమ్మర్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగా సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అయితే అదే రోజున మెగా క్యాంప్ హీరో సాయితేజ్ హీరోగా నటిస్తోన్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల కానుంది. ఒకవేళ పోటీ ఎందుకులే అనుకుని ఏప్రిల్ 24న వద్దామనుకుంటే ... ఇప్పటి సమాచారం మేరకు శర్వానంద్ శ్రీకారంతో అదే రోజున రావాలని ఎదురుచూస్తున్నాడు.
పోనీ ఆలస్యంగా వద్దామనుకుంటే పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్‌తో సందడి చేయబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని సినిమాల మధ్య ఏ తేదిన రావాలో నిర్ణయించుకోవడంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాట. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు శర్వానంద్ శ్రీకారం ఏప్రిల్ 24న విడుదల కావడం అనుమానంగానే ఉందని అంటున్నారు. కాబట్టి.. శ్రీనివాస్‌కు ఆ రోజైతేనే బెటర్ అని భావించవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com