రాఘవేంద్రరావు గెడ్డం వెనకున్న కథ..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాజాగా కింగ్ నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ నిన్న తిరుపతిలో ఎనౌన్స్ చేసారు. ఈనెల 25న ముహుర్తం..జులై 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే...రాఘవేంద్రరావు ట్విట్టర్లో తన గెడ్డం వెనకున్న కథ ఏమిటో చెప్పారు. ఇంతకీ తన గెడ్డం స్టోరీ ఏమిటంటే.... జ్యోతి సినిమా దగ్గర నుంచి సినిమాకి ముందు గెడ్డం తీసేసి షూటింగ్ ప్రారంభిస్తాను. మళ్లీ సినిమా పూర్తయిన తర్వాతే గెడ్డం తీస్తాను. జ్యోతి సినిమా దగ్గర నుంచి అలాగే ఫాలో అవుతున్నాను. ఓం నమో వేంకటేశాయ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నాను అంటూ గెడ్డం తీసేసిన ఫోటో పోస్ట్ చేసారు రాఘవేంద్రరావు. అది రాఘవేంద్రుడి గెడ్డం వెనకున్న కథ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com