రాఘ‌వేంద్ర‌రావు గెడ్డం వెన‌కున్న క‌థ‌..

  • IndiaGlitz, [Friday,June 24 2016]

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తాజాగా కింగ్ నాగార్జున‌తో ఓం న‌మో వేంక‌టేశాయ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ నిన్న తిరుప‌తిలో ఎనౌన్స్ చేసారు. ఈనెల 25న ముహుర్తం..జులై 2 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే...రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్లో త‌న గెడ్డం వెన‌కున్న క‌థ ఏమిటో చెప్పారు. ఇంత‌కీ త‌న గెడ్డం స్టోరీ ఏమిటంటే.... జ్యోతి సినిమా ద‌గ్గ‌ర నుంచి సినిమాకి ముందు గెడ్డం తీసేసి షూటింగ్ ప్రారంభిస్తాను. మ‌ళ్లీ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే గెడ్డం తీస్తాను. జ్యోతి సినిమా ద‌గ్గ‌ర నుంచి అలాగే ఫాలో అవుతున్నాను. ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నాను అంటూ గెడ్డం తీసేసిన ఫోటో పోస్ట్ చేసారు రాఘ‌వేంద్ర‌రావు. అది రాఘ‌వేంద్రుడి గెడ్డం వెన‌కున్న క‌థ‌.

More News

కొత్త త‌ర‌హా పాత్ర‌లో రామ్‌

నేను శైల‌జ స‌క్సెస్ త‌ర్వాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఎక్క‌డా తొంద‌ర‌ప‌డ‌కుండా సినిమాలు చేసుకుంటున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

నాగార్జున చిత్రం లో వెంకటేశ్వర స్వామి ఇతనేనా ?

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందనున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రం ఈ నెల 25న ప్రారంభం కానుంది.

మ‌న‌మంతా టీజ‌ర్ రిలీజ్ డేట్..

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ గురించి రాంగ్ న్యూస్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే.

జ‌క్క‌న్న కోసం వ‌స్తున్న‌ మెగాస్టార్

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం జ‌క్క‌న్న‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.