బిగ్‌బాస్ హౌస్‌లో బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేస్తారు: సూర్యకిరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సూర్యకిరణ్ ఓ ఇంటర్వ్యూలో హౌస్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్ హౌస్‌లో అంతా ఆర్టిఫిషియల్‌గా నవ్వే వాళ్లేనని.. ఎప్పుడూ బిర్యానీని చూడనట్టు బిహేవ్ చేస్తారని పేర్కొన్నారు. ఒక్క అమ్మ రాజశేఖర్ మినహా హౌస్‌లో పెద్దగా సినిమా వాళ్లెవరూ లేరు కాబట్టి వారందరికీ బిగ్‌బాస్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లంతా చాలా తెలివైన వాళ్లని.. తనకంత తెలివి లేదని సూర్యకిరణ్ పేర్కొన్నారు.
ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటేనే ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తారని వాళ్లకు తెలిసిన కారణంగానే.. వాళ్లంతా అలా చేస్తారేమోనన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో మంచి విషయాలు చెబితే వినిపించుకునేవాళ్లు లేరన్నారు. చేదు మందుని పంచదారతో ఇస్తారు కదా... కానీ తాను షుగర్ లేకుండా చేదుగా ఇచ్చేవాణ్ణనన్నారు. ఆరోగ్యం బాగుండటానికి చేదు మందు ఇస్తున్నానని వాళ్లు గ్రహించలేదని సూర్యకిరణ్ పేర్కొన్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో షుగర్ ఉన్నవాళ్లకే షుగర్ ఇస్తున్నారని సూర్యకిరణ్ పేర్కొన్నారు. అది వాళ్లకే సమస్య అని రెండు మూడు వారాల్లో తెలుసుకుంటారన్నారు. రకరకాల మైండ్ సెట్ ఉన్న ఇంతమందితో కలిసి ఉంటానని తానెప్పుడూ ఊహించలేదన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు ప్రతి రోజూ చాలా భారంగా గడిచిందన్నారు. అక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది ‘సార్.. అప్పుడే రెండు రోజులైంది’ అనేవారని... తానేమో.. ఇంకా రెండు రోజులేనా? అని ఫీలయ్యేవాణ్ణని సూర్యకిరణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments