ర‌కుల్‌ను ఇబ్బంది పెట్టిన బిచ్చగాళ్లు

  • IndiaGlitz, [Saturday,July 06 2019]

ముంబైలో భారీ వ‌ర్షాల కార‌ణంగా ర‌కుల్ ముంబైలోనే ఉండిపోయింది. అసలే వ‌ర్షాల‌తో ఇబ్బంది ప‌డ్డ ఈ అమ్మ‌డు రీసెంట్‌గా బిచ్చ‌గాళ్ల వ‌ల్ల మ‌రో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితిని ఫేస్ చేసింది. సాధార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంటే అభిమానులు ఆటోగ్రాఫ్‌, ఫోటోగ్రాఫ్‌ల కోసం వెంట‌ప‌డ‌టాన్ని చాలా సంద‌ర్భాల్లో చూసే ఉంటాం. కానీ రెస్టారెంట్‌కు వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌కుల్‌ను చిల్ల‌ర ఇవ్వ‌మంటూ కొంద‌రు చిన్నారులు చుట్టుముట్టారు. మ‌రికొంద‌రైతే ఆమె జేబులో చేయి కూడా పెట్టారు. ఆమెను కారు వ‌ద్ద‌కు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుప‌డ్డారు. ఇది ర‌కుల్‌కు వింత ప‌రిస్థితే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. చిన్నారుల ప్ర‌వ‌ర్త‌నను నెటిజ‌న్స్ ఖండిస్తున్నారు.