'సాహో' కంటే ముందుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్లో మన కథానాయకులంతా ఒక సినిమాలో నటిస్తూనే.. మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు. ఆ బాటలోనే.. కింగ్ నాగార్జున నుంచి నిఖిల్ వరకు అందరూ నడుస్తున్నారు. అయితే బాహుబలి`తో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న ప్రభాస్ మాత్రం ఈ విషయంలో కొంత వెనకబడి ఉన్నారని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ కూడా స్పీడ్ పెంచారు. బాహుబలి` సెట్స్ పై ఉన్నప్పుడే దర్శకులు సుజీత్, రాధాకృష్ణల కథలు విన్న ఈ హీరో.. అప్పట్లోనే వీరితో సినిమాలు చేస్తానని మాటిచ్చారట. అన్నట్టుగానే.. సుజీత్ డైరెక్షన్లో సాహో` చిత్రంలో నటిస్తున్నారు.
ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో పడిపోయారు. అయితే వారిని ఆనందపరిచేందుకు రాధాకృష్ణతో చేయబోయే సినిమాను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. సాహో`తో పాటు ఈ చిత్రంలో కూడా సమాంతరంగా నటించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాని సాహో` కంటే ముందుగానే అంటే.. 2019 సంక్రాంతి బరిలో దింపాలని కూడా ఈ యంగ్ హీరో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments