భారత్ పై కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ది చెప్తాం..
Send us your feedback to audioarticles@vaarta.com
మనదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా బుద్ధి చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. భారత్ ఎప్పుడూ ఎవరికి భయపడదన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన మాజీ సైనికుల ఉద్యోగుల సమావేశంలో మోదీ సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పుల్వామా దాడి ఘటన, సర్జికల్ స్ట్రైక్స్-2, ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధులు గురించి మోదీ మాట్లాడారు. కాగా సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మోదీ ఇలా ఆగ్రహంగా మాట్లాడటం ఫస్ట్ టైమ్.
దేశం కంటే మరేది ముఖ్యం కాదు..
"ఈ మట్టి సువాసనలు గుండెల్లో నింపుకున్న జాతి మనది. ఈ మట్టిలోనే పౌరుషం ఉంది.. మన ప్రతాపాన్ని చాటుదాం. యావత్ జాతికి ఇదే మాటిస్తున్నాను.. దేశం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. సగర్వ భారతవాని తల ఎత్తుకునే ఉంటుంది. దేశం ఇప్పుడు నిజంగానే సురక్షితంగా ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. ప్రతీ భారతీయ పౌరుడికి విజయం లభిస్తుంది. దేశం సంబరాలు చేసుకునే రోజు ఇది" అని మోదీ గర్వంగా చెప్పారు.!
దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి...
వీరజవాన్లు స్మృతిలో భాగంగానే నేషనల్ వార్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశామన్నారు. పుల్వామా ఉగ్రదాడి, పాకిస్థాన్ ఎదురుదాడులపై ర్యాలీలో సుధీర్ఘంగా మోదీ ప్రస్తావనకు తెచ్చారు. జై జవాన్, జై కిసాన్ అనేది తమ నినాదమని మోదీ చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం దేశ చరిత్రలోనే తొలిసారిగా మహత్తర పథకం ప్రారంభమైందని.. రైతుల ఖాతాల్లో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధులు రిలీజ్ అయ్యాయన్నారు. కేంద్రం ఇలాంటి సాయం చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారన్నారు. తొలివిడతలో భాగంగా కోటిమందికి పైగా రైతుల ఖాతాల్లో సొమ్మ జమైందన్నారు. రైతులకు మోదీ ప్రభుత్వం సాయం చేస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments