టీకా వేసుకుంటే బీరు ఫ్రీ.. అంతేకాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాలో హామీల వర్షం కురుస్తోంది. ఏదైనా ఎన్నికలా.. ఆల్రెడీ పూర్తయ్యయి కదా అని ఆలోచిస్తున్నారా? ఎన్నికల హామీలు కావవి.. ప్రస్తుతం అమెరికాలో ఉచిత కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడానికి గానూ.. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలు అనేక ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఈ హామీలు ఏవేంటో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. గత కొద్ది వారాలుగా అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించింది.
దేశ జనాభా మొత్తం 33 కోట్ల మంది అయితే 16 కోట్ల మంది ఒక డోసు వేయించుకున్నారు. 12 కోట్ల మంది రెండు డోసులూ వేయించుకున్నారు. మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వడం కోసమే అమెరికాలోని రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ తాయిలాలను తమ దేశ పౌరులపై కురిపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకుంటే ఉచితంగా బీర్లు, వైన్ ఇస్తామని ఒకరు.. మ్యూజియాలు, పార్కులోకి ఉచిత ప్రవేశమని మరొకరు.. 50 లక్షల డాలర్ల లాటరీ టికెట్ ఉచితమని, 25 డాలర్ల గిఫ్ట్ కూపన్లు, ఏడు రోజులు మెట్రో రైలులో ఉచిత ప్రయాణం కార్డు, వచ్చే ఏడాది సూపర్ బౌల్ టికెట్ల, సరకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు.. ఇలా ఎన్నో తాయిలాలు టీకా కోసం అమెరికన్లపై వచ్చి పడుతున్నాయి.
రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ సంస్థలూ జనాన్ని టీకా వేయించుకునేందుకు ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టీకా వేసుకున్నోళ్లకు కొన్ని బ్రూవరీల్లో ఫ్రీగా బీర్ ఇస్తున్నారు. డెట్రాయిట్ నగరంలో ఎవరినైనా వ్యాక్సిన్ సెంటర్ దగ్గరికి తీసుకొస్తే 50 డాలర్లు ఇస్తున్నారు. వెస్ట్ వర్జీనియాలో టీకా వేసుకుంటే 100 డాలర్లు(రూ.7,396) విలువైన సేవింగ్ బాండ్స్ ఇస్తున్నారు. ఇక సెలూన్ షాపులలో కూడా ఫ్రీ సర్వీస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాస్కాలో నార్టన్ సౌండ్ హెల్త్ కార్ప్ ప్రైజులతో పాటు ఎయిర్ లైన్ టికెట్లు ఇస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout