‘వకీల్ సాబ్’ ఈ బ్యూటీ పాత్రే హైలైట్!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 26వ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. బోనీ కపూర్ సమర్పిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేబీ వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్‌పై శిరీష్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో ఓ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
పవన్ ఫస్ట్ లుక్ రావడంతో సాంగ్స్ ఎప్పుడొస్తాయ్..? ఎలా ఉంటాయ్..? సినిమాలో పవన్‌తో పాటు నటించే నటీమణులు ఎవరు..? చిత్రబృందం సంగతేంటి..? సినిమాలో ఎవరి పాత్ర హైలైట్‌గా నిలువనుంది..? అనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలో పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయి. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఇదిగో.. అదిగో అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.
ఇంట్రెస్టింగ్ అప్డేట్!
‘వకీల్ సాబ్’ సినిమాలో నివేదా థామస్ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి ఈ బ్యూటీ పాత్రే హైలైట్‌గా నిలుస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే.. ఈమె పాత్ర ఎమోషన్‌గా సాగుతుందట. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేథా.. అందం, అభినయం.. తనకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసింది. అందుకే ఈ పాత్రకు నివేదా అయితే న్యాయం చేస్తుందని భావించిన చిత్రబృందం ఏరికోరి మరీ తీసుకున్నారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ పాత్రతో నివేదా రేంజ్ పెరిగిపోతుందట. అంతేకాదు.. అవకాశాలు గట్టిగానే ఉంటాయని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com