అందమైన ప్రేమకథ 'ఖాకి'

  • IndiaGlitz, [Friday,November 24 2017]

ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. చేతిలో స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్స్, ఐఎంఓలు.. అబ్బో రకరకాల యాప్స్.. కానీ రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉండేది? ప్రేమికులు ఒకరినొకరు ఎలా చూసుకునేవారు? ప్రేమ ఎలా ప్రవర్ధమానమయ్యేది? ఇష్టాయిష్టాలను ఒకరికొకరు ఎలా వ్యక్తం చేసుకునేవారు?.. 'ఖాకి' సినిమా చూస్తే తెలుస్తుంది. కార్తి, రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటించిన చిత్రం 'ఖాకి'. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో 1995-2005 మధ్య కాలంలో జరిగిన సన్నివేశాలను చూపించారు. పల్లెటూర్ల నుంచి ఉద్యోగాన్వేషణకు పట్టణాలకు వెళ్లిన యువకులు సెలవుల్లో తిరిగి వచ్చినప్పుడు పొరుగింటి అమ్మాయిలతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ అప్పట్లో అధికంగా ఉండేది. 'ఖాకి'లోనూ అలాంటి అంశాన్నే చూపించారు.

ఊరి నుంచి వచ్చిన అన్న చెల్లిని ఏడిపించడం, అన్న ప్రేమకు చెల్లి సాయం చేయడం, ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఒకరిని చూసి ఒకరు సైగలు చేసుకోవడం, పెద్దలకు తెలియకుండా కలుసుకోవడం వంటి విషయాలను చాలా సెన్సిటివ్గా తెరకెక్కించారు వినోద్. అప్పట్లో మార్కెట్లో హల్చల్ చేసిన రూ.500 సెల్ఫోన్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఎంత పవర్ఫుల్ పోలీస్ అయినా, వ్యక్తిగతంగా అతనికో జీవితం, అతని మనసుకో ప్రేమ, అందమైన కుటుంబం, ఆశలు, ఆకాంక్షలు.. అన్నీ ఉంటాయని చెప్పిన సినిమా ఇది.

'ఖాకి' లో చూపించిన ప్రేమ సన్నివేశాలతో ఇప్పటి మిడిల్ ఏజ్ పీపుల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతున్నారు. తమ తల్లిదండ్రుల టీనేజ్లో లవ్స్టోరీలు ఇలా ఉండేవా? అని యువతరం కొత్తగా తెలుసుకుంటున్నారు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ తెలుగులో అందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో చాలా మంచి స్పందన వస్తోంది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. జిబ్రాన్ సంగీతాన్ని అందించారు.

More News

'ప‌ద్మావ‌తి'కి భీమా

దీపికా ప‌దుకొనే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రారంభం అయిన‌ప్పటి నుండి వివాదాల బాట ప‌ట్టింది. సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే కొద్ది దేశ వ్యాప్త ఆందోళ‌నలు జ‌రిగాయి.

'జవాన్' సెన్సార్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హించిన చిత్రం జ‌వాన్‌- ఇంటికొక్క‌డు.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఈరోజు 9 గంట‌ల‌కి ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఆక్సిజన్

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

శర్వానంద్ - హను రాఘవపూడి చిత్రం ప్రారంభం

యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సరికొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 23) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.

హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా 'ముద్దుల మొగుడు'

ప్రస్తుతం ఉన్న మాధ్యమాల్లో సోషల్‌ మీడియా అతి వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలెంట్‌ ఉన్న నటీనటులు, దర్శకులు ఈ మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.