వావ్ అనిపించిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’..

  • IndiaGlitz, [Friday,October 23 2020]

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. ఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుండగా... విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ను విడుదల చేసింది. ఈ ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అభిమానులతో వావ్ అనిపించేలా ఉంది. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు' అంటూ మేకర్స్‌ ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. నిజంగా వీడియో అలాగే ఉంది.

అరచేతిలో సరికొత్త ప్రేమకథను చూపించేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది. అరచేతిలో ఓ పచ్చిక బయలు.. ఆ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నుంచి ఒక ట్రైన్ వెళుతుంటుంది. ఆ ట్రైన్‌లో లైలా, మజ్నూ.. సలీం, అనార్కలీ.. దేవదాస్, పారు.. పైనల్‌గా ప్రభాస్, పూజాల జంట. అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పకనే చెప్పారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రం లాక్‌డౌన్‌కు పూర్వమే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో తిరిగి ప్రారంభించుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెలాఖరుకు ఇటలీ షెడ్యూల్‌‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చిత్రబృందం తిరిగి రానుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై ‘రాధేశ్యామ్’ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ బాషల్లో రూపొందుతోంది. నెలాఖరుకు ఇటలీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రబృందం హైదరాబాద్‌కు తిరిగి రానుంది.