'బ్యూటిఫుల్' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ ...త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నిమలచడం జరిగింది. హీరోహీరోయిన్లు సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం కూడా ఆధ్యంతం అలరిస్తుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

More News

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'.

దిశ రేప్ వీడియోల కోసం లక్షల మంది గూగుల్‌లో వెతికారు!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'మామాంగం' ట్రైల‌ర్‌, సాంగ్ లాంచ్‌

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం'

ఆడపడుచుల కోసం ‘నంబర్-1 కోడలు’ను తెస్తున్న జీ తెలుగు!

జీ తెలుగు తన సీరియల్స్‌లో మహిళల్ని ఎంత ఉన్నతంగా, బలంగా చూపిస్తోందనే విషయం.. ఛానెల్‌లో ప్రసారమౌతున్న ‘సూర్యకాంతం’,

బ్యాంక్ డిపాజిట్ దారులకు షాకింగ్ న్యూస్!

బ్యాంకు డిపాజిట్ దారులకు ఈ వార్త నిజంగానే షాకింగ్ అని చెప్పుకోవచ్చు.