సిగ్గుపడండి.. మీరు నాశనమైపోతారు: పూనమ్ కౌర్

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

యావత్ భారతదేశ వ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ రేప్ కేసులోని నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయబోతున్నారన్న విషయం విదితమే. అయితే.. ఈ ఉరి శిక్షను తప్పించుకోవడానికి నిందితులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాబిక్షను తిరస్కరించాడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకరైన ముకేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇలా వరుస ఘటనలపై అసలేం జరుగుతోంది..? సుప్రీంకోర్టు తీర్పు అంటే గౌరవం లేదా..? అన్నట్లుగా సామాన్యుడు కూడా ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఈ వ్యవహారంపై సినీ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మానవ హక్కుల సంఘాల కార్యకర్తల పేరుతో దోషులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని పూనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌లు దాఖలు చేయడమే పనిగా పెట్టుకుని అలసిపోయాయని ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కాపాడాలని చూస్తారా!?

‘ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగితే మానవ హక్కుల సంఘాల పేరుతో ఇలాంటి వ్యవహారాలు ఎలా నిర్వహిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ కిరాతకులను కాపాడాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చిందో అంతకంటే అర్థం కావట్లేదు. జరుగుతున్న పరిణామాలను చూసి నా మెదడు మొద్దుబారింది. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఇలాంటి రేపిస్టులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారు నాశనమైపోతారు. నిర్భయకు న్యాయం జరగాలని వాహే గురు, తిరుపతి బాలాజీని వేడుకుంటున్నాను’ అని తన పేస్‌బుక్‌లో పూనం రాసుకొచ్చారు. ఆమె పోస్ట్‌పై పలువురు నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాగా.. సామాజిక విషయాలపై పూనం స్పందిస్తూ.. తనదైన శైలిలో పోస్ట్‌లు పెడుతుంటారన్న విషయం తెలిసిందే.

More News

రాజధాని వైజాగ్ ‘నై’: జీఎన్ రావు కమిటీ వివరణ

నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓ కొత్త విషయం వెలుగు చూసిందని..

‘పీకే’ను జేడీయూ నుంచి పీకేశారు!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు జేడీయూ ఊహించని షాకిచ్చింది. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఉపాధ్యక్షుడుగా ఉన్న పీకేను ఆ పార్టీ పీకేసింది.!

'జాను' మేజిక్‌పై న‌మ్మ‌కంగా ఉన్నాం:  దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో

పది వసంతాలు పూర్తి చేసుకున్న 'వై నాట్' స్థూడియోస్

29 జనవరి 2020: ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోగా మేం ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నాం. ఒక బ్యానరుగా సాధారణం కంటే భిన్నమైన కంటెంట్ తో స్థిరంగా సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు

జాతీయ‌స్థాయి కొరియోగ్రాఫ‌ర్స్‌లో బాలీవుడ్‌కి చెందిన కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.