Chandrababu:పెత్తందార్లకు పెద్దపీట.. బీసీలకు వెన్నుపోటు.. ఇదే చంద్రబాబు నైజం..
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గరి నుంచి బడుగు, బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచేశారు. ఆయన హయంలో ఎంతో బీసీలు, ఎస్సీలు, నిమ్మ కులాలకు చెందన వారు చట్టసభల్లో అడుగుపెట్టేవారు. దీంతో టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడింది. దీంతో ఆ వర్గాలు కూడా టీడీపీకి అండగా నిలిచాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టాక పరిస్థితి మాత్రం మారిపోయింది. బీసీలను దూరంగా పెడుతూ కేవలం డబ్బులున్న పెత్తందార్లుకే మాత్రమే పదవులు కట్టబెట్టారని ఆ వర్గాల నాయకులే చెబుతూ ఉంటారు.
దీంతో కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలు పార్టీలో చొరబడ్డారని.. ఈ క్రమంలో డబ్బులేని వెనకబడిన వర్గాల నేతలూ మొల్లగా పార్టీ నుంచి కనుమరుగైపోయారని పేర్కొంటున్నారు. బీసీలు అంటే వర్ణ వ్యవస్థలో కింది కులాల వారు కాబట్టి వారిని కిందనే ఉంచాలన్నది చంద్రబాబు తత్వమని మండిపడుతున్నారు. బీసీలకు అవకాశాలు ఇవ్వరాదని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలన్నది ఆయన విధానంగా మారిందని ఆరోపిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలోనూ చంద్రబాబు ఈ వివక్ష చూపించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరోసారి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అవుతున్నారు. 94మంది అభ్యర్థుల్లో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రమే కేటాయించారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో 45శాతం బీసీలకు 18 సీట్లతో సరిపెట్టారు. 2014లో 43 స్థానాలు బీసీలకి ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానన్న మాటను ఆయన నిజం చేసి చూపించారు.
ఇక మైనారిటీ వర్గాలను అయితే మరీ నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానమే కేటాయించారు. కానీ కేవలం 4.5శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం 22 స్థానాలు కేటయించారు. దీంతో చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారని బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మిగిలిన 57 సీట్లలోనూ బీసీ, మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తారన్న నమ్మకం లేదని ఆ వర్గీయులు వాపోతున్నారు. చంద్రబాబుపై రగిలిపోతున్న బీసీలు.. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు పవర్ ఏంటో టీడీపీకి రుచి చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments