జీ 5లో 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఎక్స్‌క్లూజివ్ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5. గత ఏడాది ఏప్రిల్‌లో 'అమృతరామమ్' సినిమాను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది జీ 5. ఆ తర్వాత '47 డేస్', 'మేక సూరి'ను వీక్షకులకు అందించింది. ఇంకా అనేక వెబ్ సిరీస్‌లు, సినిమాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది 'బట్టల రామస్వామి బయోపిక్' సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది జీ 5. ఆ తర్వాత 'రూమ్ నంబర్ 54' వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులతో ఈ ఏడాది ఒరిజినల్ కంటెంట్ రిలీజ్‌లను జీ5 స్టార్ట్ చేసింది.
Also Read: కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి
అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బట్టల రామస్వామి బయోపిక్కు', మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు తెలిపారు. జీ5తో అసోసియేట్ కావడం, తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ ఐ, 'మ్యాంగో మీడియా' రామ కృష్ణ వీరపనేని చెప్పారు.
'బట్టల రామస్వామి బయోపిక్కు' కథ విషయానికి వస్తే... రామస్వామికి జీవితంలో రెండంటే రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి... శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. రెండు... చీరల వ్యాపారం చక్కగా చేసుకోవాలి. కోరుకున్నట్టుగా... వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రామస్వామి.. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకోవాలంటే... మే 14న జీ5 ఓటీటీ ఓపెన్ చేయాల్సిందే.
'తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బ్రతుకూ ఒక బయోపిక్కే' డైలాగ్‌తో 'బట్టల రామస్వామి బయోపిక్కు' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామస్వామి పాత్రలో అల్తాఫ్ హాసన్ నటించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.
మే 14న 'బట్టల రామస్వామి బయోపిక్కు' విడుదల చేస్తున్న జీ 5, మే 21న 'రూమ్ నంబర్ 54' వెబ్ సిరీస్ ను వీక్షకుల ముందుకు తీసుకు రానున్నది. మే 13న 'జీప్లెక్స్'లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ 'రాధే' విడుదల కానున్న సంగతి అందరికి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments