'బస్తీ' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా రంగంలో నట వారసుల హవా కొనసాగుతుంది. ఈ కోవలో చాలా మంది హీరోలు సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత తమ ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అలాగే సీనియర్ నటి జయసుధ తనయుడు రేయాన్ కూడా సినీ రంగ ప్రవేశం చేశాడు. కుర్రాడు చూడటానికి బావున్నాడు. ఈ విషయాలను పక్కన పెడితే జయసుధ తన తనయుడు తొలి సినిమా బాధ్యతలను వాసు మంతెన అనే కొత్త దర్శక, నిర్మాతకి అప్పగించింది. తొలి ప్రయత్నంగా శ్రేయాన్ తో లవ్ చిత్రాన్ని రూపొందించాడు. సహజనటిగా సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న జయసుధ తనయుడు ఎలాంటి పెర్ ఫార్మెన్స్ చేశాడో తెలియాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే...
కథ
అమ్మిరాజు(ముకేష్ రుషి), బిక్షపతి(కోట శ్రీనివాసరావు) రెండు వైరి వర్గాలకు చెందినవారు. ఒకరంటే ఒకరికి పడదు. ఓ సందర్భంలో బిక్షపతి తనయుడు భవాని(అభిమన్యు సింగ్) అమ్మిరాజు మనిషికి చెందిన అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసేస్తాడు. దాంతో అమ్మిరాజు బిక్షపతి కుమార్తె స్రవంతి(ప్రగతి)ని కిడ్నాప్ చేయిస్తాడు. దాంతో బిక్షపతి, భవాని మనుషులు స్రవంతిని వెతుకుతుంటారు. ఆ సమయంలో అమ్మిరాజు తమ్ముడు విజయ్(శ్రేయాన్) అమెరికా నుండి వస్తాడు. తన ఇంట్లో ఉన్న బంధీగా ఉన్న స్రవంతిని విడిపించి, ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. వారి మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తన అన్న అమ్మిరాజుతో తన ప్రేమ విషయం చెబుతాడు. అప్పుడు అమ్మిరాజు ఏం చేస్తాడు? బిక్షపతి విజయ్, స్రవంతిల పెళ్లికి ఒప్పుకుంటాడా? చివరికి విజయ్, స్రవంతిల కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష
శ్రేయాన్ లుక్ పరంగా చాలా బావున్నాడు. అయితే నటన పరంగా, డ్యాన్సులు చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. మంచి లవ్ సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ చూపెట్టలేకపోయాడు. శ్రేయాన్ తొలి సినిమా కనుక తన నుండి ఓ రేంజ్ పెర్ ఫార్మెన్స్ ఆశించడం తప్పే. హీరోయిన్ ప్రగతి సంగతి సరేసరి. శ్రేయాన్ పక్కన ఆనలేదు. సరికదా ఓ మంచి పర్సనాలిటీ ఉన్న హీరో పక్కన ప్రగతినే హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో డైరెక్టర్ తెలియాలి. తొలి సాంగ్ లో డ్యాన్స్ సరిగా చేయలేదు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం బావులేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. గుణశేఖర్ సినిమాటోగ్రఫీ బాగా లేదు. కేరలో చిత్రీకరించిన సాంగ్ మినహా కెమెరావర్క్ పేలవంగా ఉంది. దర్శక, నిర్మాత వాసు మంతెన మంచి కథను ప్రిపేర్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. దాని తగిన విధంగా కథనం కూడా వీక్ గా ఉంది. ఎడిటింగ్ బాగా లేదు.
ముకేష్ రుషి, అభిమన్యు సింగ్, కోటశ్రీనివాసరావు లు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలా సీన్స్ లో ఎమోషన్స్ సరిగా పండలేదు. హీరో అన్నయ్య, హీరోయిన్ నాన్న చనిపోతే వారి ముఖాల్లో కనీస బాధ కూడా కనపడదు. సినిమా చాలా విషయాల్లో వీక్ అనిపిస్తుంది. అప్పటి వరకు విలన్స్ నుండి తప్పించుకు తిరిగే హీరో క్లయిమాక్స్ లో విలన్ తో తన ప్రేమ గురించి గొప్పగా చెప్పుకునే సన్నివేశంలో ఫీల్ మిస్సయిన భావన కలుగుతుంది.
విశ్లేషణ
శ్రేయాన్ నటన వారసత్వంగా తీసుకుని సినిమా రంగంలోకి ఎంటర్ కావడం కాదు, నటన అనే కళ, వృత్తి కాబట్టి సీరియస్ గా తీసుకుని ఫుల్ ఎనర్జీతో తెరంగేట్రం చేయాల్సింది. అలాగే డైరెక్టర్ వాసు మంతెన సెల్ఫ్ లెర్నింగ్ తో సినిమా తీయడం మంచిదే కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కథ, కథనం వీక్ గా ఉండటం, కామెడి సరిగా లేకపోవడం ఇలాంటి కారణాలు ఆడియెన్స్ సహానానికి పరీక్ష పెడతాయనడంలో సందేహం లేదు. దర్శకత్వమే కాకుండా మిగిలిన మేజర్ డిపార్ట్ మెంట్స్ అయినా కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ కూడా సినిమాకి బలాన్ని చేకూర్చలేకపోయాయి.
బ్యాటమ్ లైన్: బస్తీ`...ప్రేక్షకుడి సహనంతో కుస్తీ
రేటింగ్: 1.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments