స్వార్ధం కోసం.. చిరంజీవి పై అబద్దపు ప్రచారం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈమధ్య చిరంజీవి గురించి అబధ్ధాల ప్రచారం ఎక్కువయ్యింది...గతం లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎలా చేసారో మళ్ళీ అలా...కొంతమంది స్వార్ధం కోసం చిరంజీవి మీద రకరకాలుగా కేవలం అబధ్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పులు తొడుక్కునేలోపల అబధ్ధం ప్రపంచాన్నే చుట్టివచ్చేస్తుందనే నానుడి ఋజువయ్యింది.ఆర్.కె.నాయుడు (చిరంజీవి అమ్మమ్మ తాత) భార్య కాంతమ్మతో నెల్లూరు నుండి మొగల్తూరు వచ్చి,రైస్ మిల్లు,వ్యవసాయం చేసుకుంటూ స్తిరపడ్డారు. ఆయనకు కాంతమ్మ వల్ల సంతానం కలగకపోవడం వల్ల రెండో వివాహం చేసుకున్నారు. పాలకొల్లు దొడ్డొపట్ల దగ్గరి కుమ్మరిపాలెం అనే గ్రామానికి చెందిన కొణిదల వారి ఆడపడుచు రాధాబాయమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే విచిత్రమైన విషయం రెండోపెళ్ళి చేసుకున్నాక మొదటిభార్యకు అయిదుగురు పిల్లలు పుట్టారు. రెండో భార్యకు పిల్లలు కలగలేదు. అప్పుడు ఆర్.కె.నాయుడు ఆలోచించి మొదటి భార్య పెద్ద కూతురు అంజనాదేవికి రెండవభార్య తమ్ముడు కొణిదల వెంకట్రావుకు వివాహం చేసారు .వారి ప్రధమ సంతానమే మన చిరంజీవి.
చిరంజీవి తండ్రి ఊరు కుమ్మరిపాలెం. మొగల్తూరు చిరంజీవి అమ్మమ్మ ఊరు. నర్సాపురం మిషనరీస్ ఆసుపత్రిలో 22-08-1955న చిరంజీవి జన్మించారు. కొణిదల వెంకట్రావు పెనుగొండ, ఒంగోలు,బాపట్ల,చీరాల,నెల్లూరు ఇలా చాలా ఊళ్లలో ఉద్యోగం చేసారు. చిరంజీవి చదువు సాగటంలేదని ఏడవ తరగతి మొగల్తూరు లో చేర్పించారు. అందరూ చిరంజీవిది అనుకునే మొగల్తూరు లోని ఇల్లు..నిజానికి చిరంజీవి మేనమామ జలకం శ్రీనివాసరావుది. అతను మద్రాసులో వుండేవాడు.అక్కడ ఇల్లు కొనుక్కోడం కోసం మొగల్తూరులో తన తండ్రి ద్వారా వచ్చిన వారసత్వ ఆస్తిని అమ్మి,మద్రాసులో ఇల్లు కొనుక్కున్నాడు. పుట్టింటిలో పురుడు పోసుకుంటే పుట్టిన బిడ్డకు అమ్మమ్మ ఇల్లు సొంతమైపోతుందా...అవ్వదు కదా..! మరి ఈ అమ్మమ్మ,మేనమామల ఇల్లు చిరంజీవిది ఎలా అవుతుంది. తనది కాని ఇల్లుని చిరంజీవి ఎలా అమ్ముకుంటారు. మొగల్తూరు లోని ఆస్తులు చిరంజీవికి చెందుతాయా?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments