భారతీయ సంగీత ప్రపంచంలో విషాదం.. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహిరి కన్నుమూత

  • IndiaGlitz, [Wednesday,February 16 2022]

ఇప్పటికే లతా మంగేష్కర్, నిన్న రాత్రి హీరో దీప్ సిద్ధూ మరణాల నుంచి కోలుకోకముందే భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు బప్పి లహిరి (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజమున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

1952లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని జల్పాయ్‌గురి నగరంలో బప్పిలహిరి జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ స్వతహాగా సంగీతకారులు కావడంతో బప్పిలహిరికి చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రావీణ్యం పొందారు. మూడేళ్ల వయసులోనే తబలా నేర్చుకున్నారు. అనంతరం మాతృభాష అయినా బెంగాలీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ‘డిస్కో డ్యాన్సర్‌’, ‘సాహెబ్‌’, ‘డ్యాన్స్‌ డ్యాన్స్‌’, ‘గురు దక్షిణ’, ‘కమాండో’, ‘గురు’, ‘ప్రేమ ప్రతిజ్ఞ’, ‘త్యాగి’, ‘రాక్‌ డ్యాన్సర్‌’, ‘ది దర్టీ పిక్చర్‌’, ‘బద్రినాథ్‌ కీ దుల్హనియా’ వంటి చిత్రాల్లో ఆయన అందించిన ట్యూన్ దేశాన్ని ఊపేశాయి.

బప్పిలహిరి ప్రతిభను గమనించిన సూపర్‌స్టార్‌ కృష్ణ తాను నిర్మించి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ సినిమా పాటలు తెలుగు నాట సంచలనం సృష్టించడంతో ఆయనకు టాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు వరించాయి. ‘త్రిమూర్తులు’, ‘సామ్రాట్‌’, ‘స్టేట్ రౌడీ, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘నిప్పు రవ్వ’, ‘బిగ్‌బాస్‌’ సినిమాలకు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పని చేశారు. ఇక ఆయన చివరిగా హిందీలో ‘భాఘి-3’కి సంగీతం అందించడంతో పాటు స్వరాలు సమకూర్చారు. రాజకీయాలపై ఆసక్తితో 2014లో ఆయన బీజేపీలో చేరారు.

More News

‘నో కామా-నో ఫుల్ స్టాప్-నాన్ స్టాప్‌గా’ ఓటీటీ వేదికగా బిగ్‌బాస్ , ఆకట్టుకుంటోన్న ప్రోమో

భారతదేశంలో బిగ్‌బాస్ షోకి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ రియాలిటీ షో..

రెండు వారాల్లో గుడ్‌న్యూస్ చెబుతానన్నారు.. అలీకి జగన్ క్లారిటీ ఇచ్చేశారా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రభుత్వం ఇన్విటేషన్ పంపింది, నాన్నకి అందనివ్వలేదు.. ఎవరిపనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

యువ ప్రేక్షకులకు నచ్చేలా "వర్జిన్ స్టోరి" ఉంటుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.

పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల

రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.