17న వస్తోన్నయూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బి.ఎ.పాస్'
Send us your feedback to audioarticles@vaarta.com
"ది రైల్వే ఆంటీ" అనే ప్రఖ్యాత నవల ఆధారంగా హిందీలో తెరకెక్కించిన చిత్రం "బి.ఎ.పాస్". హిందీలో విమర్శకుల ప్రశంసలతోపాటు దండిగా లాభాలు సైతం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత ఎం.అచ్చిబాబు. "మినిమం గ్యారెంటీ మూవీస్" పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిల్పా శుక్లా-షాదాబ్ కమల్ ముఖ్యపాత్రదారులుగా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలను బుధవారం, ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల ఛేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్, మల్కాపురం శివకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, గొట్టిముక్కల పద్మారావు, వి.ఎస్.పి.తెన్నేటి, చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు పాల్గొన్నారు.
పోస్టర్స్, ట్రైలర్స్ చూడ్డానికి చాలా బోల్డ్ గా ఉన్నప్పటికీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించడానికి ఎంతో మంది పోటీ పడినప్పటికీ.. ఈ చిత్రం డబ్బింగ్ హక్కులను చేజిక్కించుకొన్నాం. క్వాలిటీపరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని అనువదించాం. యూత్ కి మంచి ఎంటర్ టైన్ మెంట్ తోపాటు ఓ చక్కని మెసేజ్ ను అందించే చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు తెలిపారు.
బి.ఎ.పాస్ అనే చిత్రానికి మాటలు రాసే అవకాశం లభించడం నా అదృఉష్టం. నిర్మాత అచ్చిబాబుకు ఉన్న మంచి టేస్ట్ వల్లే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, తెలుగు స్ట్రయిట్ సినిమా చూస్తున్నామని ప్రేక్షకులు భావించే స్థాయిలో ఈ సినిమా డబ్బింగ్ ఉంటుందని ఈ చిత్రానికి మాటలు అందించిన ప్రముఖ నవలా రచయిత వి.ఎస్.పి.తెన్నేటి అన్నారు.
నిర్మాతగా అచ్చిబాబు ఎదుగుదులకు "బి.ఎ.పాస్" చిత్రం ఓ పునాదిగా నిలవాలని, త్వరలోనే అతను మరిన్ని చిత్రాలు నిర్మించాలని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆశీస్సులందించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులందరూ "బి.ఎ.పాస్" చిత్రం ఘన విజయం సాధించి.. నిర్మాతగా ఎం.అచ్చిబాబు మంచి పేరుతోపాటు లాభాలు సంపాదించుకోవాలని అభిలషించారు.
శిల్పా శుక్ల, షాదబ్ కమల్, రాజేష్ శర్మ, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్, దర్శకత్వం: అజయ్ బాల్, నిర్మాత: ఎం.అచ్చిబాబు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout