'బంతిపూల జానకి' ట్రైలర్ విడుదల!

  • IndiaGlitz, [Sunday,May 22 2016]
ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసారు. ధన్ రాజ్-దీక్షాపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో "కళ్యాణి-రామ్-తేజ" సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న మా "బంతిపూల జానకి" ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియోను విడుదల చేసి.. జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

More News

జెంటిల్ మ‌న్ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న నిర్మాత‌

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అష్టా చమ్మా తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.

సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ డేట్ ఖ‌రారు

నాగచైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ అందిస్తున్నారు.

ఈ నెల 27న వ‌స్తున్న బాలీవుడ్ మూవీ వీర‌ప్ప‌న్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కించిన కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాన్ని బాలీవుడ్ లో వీర‌ప్ప‌న్ అనే టైటిల్ తో రీమేక్ చేసారు.

పౌర్ణ‌మి సంద‌ర్బంగా 'చంద‌మామ రావే' చిత్ర లోగో విడుదల‌

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమ‌య్యి యూత్ హ‌ర్ట్ ని దొచుకున్న న‌వీన్ చంద్ర చేస్తున్న నూత‌న చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. అది రాదు.. వీడు మార‌డు అనే చ‌క్క‌టి క్యాప్ష‌న్ ని ఇటీవ‌లే ఎనౌన్స్ చేశారు.

నవీన్ చంద్ర హీరోగా వేణు మూవీస్ ప్రొడక్షన్ నెం.1

గతంలో రెండు దశాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వందలకు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వేణు మూవీస్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది.