గుమ్మడికాయ కొట్టుకున్న 'బంతిపూల జానకి'
Send us your feedback to audioarticles@vaarta.com
కొబ్బరికాయ కొట్టడంతో సినిమా షూటింగ్ ప్రారంభించి.. షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టడం అన్నది చిత్ర పరిశ్రమలో ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న "బంతిపూల జానకి" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి 31న గుమ్మడికాయ కొట్టారు.
ధన్ రాజ్-దీక్షపంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణిరామ్ నిర్మిస్తున్నారు. షకలక శంకర్, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, వేణు, రాకెట్ రాఘవ, చమక్ చంద్ర, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుదీర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్, ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, సుడిగాలి సుదీర్, రాకెట్ రాఘవలతో పాటు చిత్ర ఛాయాగ్రాహకులు జి.లింగబాబు పాల్గొన్నారు.
ధన్ రాజ్ గారి సహాయ సహకారాలతో "బంతిపూల జానకి చిత్రాన్ని అనుకున్న రోజుల్లో, అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగామని,, సరి కొత్త జోనర్ లో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు ప్రవీణ్ చందర్ పేర్కొన్నారు.
ధన్ రాజ్ మాట్లాడుతూ.. "మా నిర్మాత కల్యాణిరామ్ గారు నా మీద, మా డైరెక్టర్ మీద గల నమ్మకంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెట్ కి రాలేదు. ఆయన మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేమంతా మరింత అంకితభావంతో పనిచేయాల్సి వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు మా "బంతిపూల జానకి" ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వేళా విశేషం వల్లో ఏమో గాని.. షూటింగ్ మొత్తం పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో జరిగిపోయింది. ఇంతమంది బిజీ కమెడియన్స్ కాంబినేషన్ లో షూటింగ్ కి ఎప్పుడూ ఏ అవాంతరం రాకపోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము" అన్నారు.
"బంతిపూల జానకి" చిత్రంలోని ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఉందని, "రాజు గారి గది" తర్వాత తనకు మళ్ళీ అంత మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుందని షకలక శంకర్ అన్నారు. "బంతిపూల జానకి" వంటి ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ సంతోషం వ్యక్తం చేశారు. 2016లో ఘన విజయం సాదించే చిత్రాల జాబితాలో కచ్చితంగా చోటు సంపాదించుకొనే "బంతిపూల జానకి" చిత్రానికి ఛాయాగ్రహణం అందించడం చాలా ఆనందంగా ఉందని కెమెరామెన్ జి.లింగబాబు అన్నారు.
ఫణి, నాగి, జీవన్, అవినాష్, కోమలి, భాను, ప్రియ, చాందిని, దేవీప్రియ, దేవిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. ప్రొడక్షన్ కంట్రోలర్: మల్లి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బాబానందన్, కో-డైరెక్టర్: బోయనపల్లి రమణ, ఫైట్స్: సూపర్ ఆనంద్, డాన్స్: ఆర్.కె, ఆర్ట్: విజయకృష్ణ, పబ్లిసిటి డిజైనర్: వివా పోస్టర్స్, పాటలు: కాసర్ల శ్యాం, ఎడిటింగ్: శివ వై. ప్రసాద్, కెమెరామేన్: జి. లింగబాబు, సంగీతం: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజ, నిర్మాత: కల్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments