'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో 'బంతిపూల జానకి' మోషన్ పోస్టర్ లాంచ్!!
Saturday, March 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి". హాస్యానికి పెద్ద పీట వేస్తూ "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో వేడుక సందర్భంగా.. "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో ఫంక్షన్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఎన్. టీవీలో రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ.. "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో విడుదల సందర్భంగా "బంతి పూల జానకి" మోషన్ పోస్టర్ ను ఎన్. టీవీలో రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, నిర్మాత: కళ్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments