బ్యాంకులకు వరుస సెలవులు... ఖాతాదారులు జాగ్రత్త
Send us your feedback to audioarticles@vaarta.com
బ్యాంక్ ఖాతాదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి 30 వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో ముందుగానే ఖర్చులకు డబ్బులు తీసిపెట్టుకుంటే బాగుంటుంది.
ఈ నెల 26, 27న బ్యాంక్ యూనియన్లు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం తో ఈ రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు తెరుచుకోవు. ఇక 30వ తేదీన హాఫ్ ఇయర్లి క్లోజింగ్ కావున బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 1న బ్యాంకులకు సెలవులు కాకపోయినా... ఉద్యోగులు మాత్రం వరుస సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి నేషనల్ హాలిడే. అంటే వరుసగా బ్యాంకుల లావాదేవీలు జరగక సామాన్య ప్రజలు ఇబ్బంది పడడమే కాదు... ఉద్యోగుల జీతాల విషయంలోనూ ఇబ్బందులే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments