నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

తెలంగాణలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపుతో బస్సులు, మెట్రో రైళ్లతో పాటు బ్యాంకుల పని వేళల్లో సైతం మార్పులు సంభవించాయి. మారిన వేళల ప్రకారం.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ మేరకు బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండో విడత లాక్‌డౌన్ ఆదివారంతో ముగియడంతో.. ఆపై తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ కేబినేట్ ఆదివారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జూన్ 9 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ తెలిపింది. మారిన పనివేళలు నేటి నుంచి అమలులోకి రానుండగా.. జూన్ 9వ తేదీ వరకు ఇవి వర్తించనున్నాయి. ఇక లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపు సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సండలింపు ఉంటుందని.. దీంతోపాటు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

 
 

More News

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటారా? ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉందా? అంటే... దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత వి. విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు వింటే 'అవును'

మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

కరోనా సమయంలో తన వంతు భాద్యతగా మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సహాయాలు, విరాళాలు ఇలా ఎన్నో విధాలుగా

బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ పేరు చెప్పగానే ముత్తు, నరసింహ, దశావతారం, స్నేహం కోసం లాంటి సెన్సేషనల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళంలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు

రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి

వివాహం తర్వాత ప్రియమణి సినిమాల జోరు తగ్గించింది. బుల్లితెర షోలలో కనిపిస్తోంది. ప్రియమణి తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది.

బుర్రిపాలెంలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో సెలెబ్రిటీలు తమ వంతుగా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.