‘బంజార’ సినిమాను బ్యాన్ చేయాలి!

  • IndiaGlitz, [Tuesday,March 03 2020]

హారర్ మూవీ ‘క్షుద్ర’ దర్శకుడు నాగుల్ ఇప్పుడు ‘బంజార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే.. ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాదు కుర్రాళ్లకు కావాల్సినంత రొమాంటిక్ టచ్‌ను కూడా ఇస్తుంది. అమృత, ట్వింకిల్ కపూర్, తేజేష్ వీర, హరీష్ గౌలి, జీవా, జీవీ ప్రధాన పాత్రల‌లో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. అయితే సినిమా టీజర్‌లో అంతా హాట్ హాట్‌గా ఉండటంతో బంజరా సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో సినిమాను నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వాటిని తొలగించండి!

బంజార సంప్రదాయాలను కించపరిచేలా రూపొందించిన ‘బంజార’ సినిమాను నిషేధించాలని గిరిజన ప్రజా సమాఖ్య.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. లంబాడీల సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించే వరకూ ‘బంజార’ సినిమాను విడుదల చేయనివ్వకుండా సెన్సార్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శంకర్ నాయక్.. కమిషన్‌ను కోరారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించే వరకు సినిమాను విడుదల చేయరాదని వారు కోరారు. ‘బంజార’ సినిమా నిర్మాత, డైరెక్టర్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.

బోల్డ్ టీజర్!

తెలుగు, తమిళ భాష‌ల్లో మార్చిలో విడుదలకు సిద్ధమ‌వుతోన్న ఈ చిత్రం టీజ‌ర్‌ను ఇటీవలే విడుదల చేశారు. టీజర్‌లో అడల్ట్ కంటెంట్‌ను బాగానే చొప్పించారు. ‘పెళ్లయిన తర్వాత అలా ఎంజాయ్ చేస్తే తప్పేముంది’ అంటూ డైలాగ్ కూడా చెప్పించారు. అయితే, లంబాడ మహిళ వేషధారణలో ఉన్న అమ్మాయి క్యారెక్టర్ ఆసక్తి రేపుతోంది. మరి తాజా వివాదంతో సినిమా యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

NPR పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల విషయమై ఆందోళనలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

చ‌రణ్ నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనే..!!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

ఏపీకి కరోనా పాకిందా.. ఆ 17 మంది సంగతేంటి!?

ఆంధ్రప్రదేశ్‌కూ కరోనా వైరస్ పాకిందా..? హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఏపీకి చెందిన వారు కూడా ప్రయాణించారా..?

రెజీనా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘నేనే నా..?’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’.

'పలాస 1978' గొప్ప సినిమా అవుతుంది: నాగ శౌర్య

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో