'బంగారి బాలరాజు' విజయంతో ముందుగానే మాకు దీపావళి వచ్చింది - దర్శకనిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎటువంటి అంచనాలు లేకుండా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మౌత్ టాక్ తో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ సందర్బంగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ దగ్గర కేక్ ను కట్ చేసి, బాణాసంచాని కాల్చి దీపావళిని ఆనందంగా ముందుగానే జరుపుకుంది.
రాయలసీమలో పరువు హత్యల నేపధ్యంలో యధార్ధ ప్రేమకధతో వచ్చిన మా బంగారి బాలరాజు విజయానందాన్ని మీడియాతో దర్శకుడు కోటేంద్ర దుద్యాల పంచుకుంటూ.... బంగారి బాలరాజు విజయానికి కారకులైన ప్రేక్షక దేవుళ్లకు మరియు నా మీడియా మిత్రులకు దన్యవాదాలు తెలియజేస్తూ, నేనూ మీడియానుండి వచ్చిన వాడినే, నేను దర్శకుడిగా సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ కు మా చిత్రయూనిట్ కి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.
చిత్రహీరో రాఘవ్ మాట్లాడుతూ... నా మొదటి సినిమానే మంచి సక్సెస్ ను సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ కోటేంద్ర సార్ కు నా జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మా చిత్రం ఎటువంటి అంచానాలు లేకుండా విడుదల చేశాము. కానీ కొంతమంది మా శ్రేయోభిలాషులు ఎందుకు సొంతంగా విడుదల చేసుకుని రిస్క్ తీసుకోవడం అని అనడంతో కొంత ఆందోళన చెందాము కానీ కధ మీద, దర్శకుడి మీద నమ్మకంతో 113 ధియేటర్లలో వరల్డ్ వైడ్ గా “బంగారి బాలరాజు” ను విడుదల చేశాము. ఇప్పుడీ సినిమా మౌత్ టాక్ తో మా చిత్రయూనిట్ కు ముందుగానే దీపావళి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ నుండి కూడా సోమవారం నుండి మరిన్ని ధియేటర్స్ ను పెంచుతామని రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments