'బంగారి బాలరాజు' అక్టోబర్ 25న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ మూవీ ఆఫీస్ లో జరిగింది.
దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా చిత్రం బంగారి బాలరాజు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలానే ఈ చిత్రాన్ని మా శ్రేయోభిలాషికి చూపించగా, అతను థియేటర్ నుండి బయటకు రాగానే ఈ చిత్రం ఒక నెల ముందు వచ్చి ఉంటే మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య జరిగి ఉండేది కాదేమోనని అన్నారు. ఈనెల 25 న విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము అని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరయిన కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ.. కోటేంద్ర దుద్యాల మాకు చెప్పిన చెప్పిన దానికంటే కూడా కధను బాగా తెరకెక్కించారు. ఈ స్టోరీ రాయలసీమ లో జరిగిన ఒక యధార్ధ పరువు హత్యను సినిమా టిక్ గా మా దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల చేస్తున్నాము. "బంగారి బాలరాజు" అందరికి నచ్చుతుంది అని నిర్మాత రఫి తెలిపారు.
మరో నిర్మాత రెడ్డం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం ద్వారా మా అబ్బాయి రాఘవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి కాపీ చూసాము. చిత్రంలో ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లి కొడుకుల సెంటిమెంట్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. మొదటి సినిమా అయినా మా అబ్బాయి బాలరాజు క్యారెక్టర్ లో బాగా నటించి, అనుకున్న దానికంటే బాగా చేసాడు. ఈ నెల 25న "బంగారి బాలరాజు" తో వస్తున్న మా అబ్బాయికి మీ మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout