Jayalalitha: పెద్ద ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి.. జయలలిత బంగారు ఆభరణాలు తీసుకెళ్లండి..

  • IndiaGlitz, [Tuesday,February 20 2024]

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు సంబంధించిన బంగారు ఆభరణాల విషయంలో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వానికి ఆభరణాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రెండు రోజులను కేటాయించింది. ఆ రెండు రోజుల్లో ఆభరణాలను తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రా భరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండిని ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది.

మార్చి 6, 7 తేదీల్లో వచ్చి బంగారు, వజ్రాభరణాలను తీసుకెళ్లాలని సూచించింది. బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించినట్లు న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలంది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రత సిబ్బందితో రావాలని ఆదేశాలు జారీ చేసింది. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వానికి లిటిగేషన్‌ ఫీజుగా రూ.5కోట్లు చెల్లించాలని కూడా తెలిపింది.

తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని ఆమె నివాసం నుంచి అధికారులు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో జయలలిత దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టంచేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు.

దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 7 కేజీల 40 గ్రాములు బరువున్న 468 రకాల బంగారు, వజ్రాభరణాలు.. 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సీడీ ప్లేయర్లు, ఒక్క వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదు ఉన్నాయి.

More News

Record Break:500 మంది కోసం కోట్లు దానం చేశారు.. సోషల్ మేసేజ్‌తో 'రికార్డ్ బ్రేక్' సినిమా

ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘రికార్డ్‌ బ్రేక్‌’ అని నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు.

Alla Ramakrishna Reddy: వైసీపీలో చేరిన ఆర్కే.. నారా లోకేశ్‌ను ఓడిస్తామని వ్యాఖ్యలు..

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

Pawan Kalyan: అభ్యర్థులను ప్రకటించేస్తున్న పవన్ కల్యాణ్.. భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు..

టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు రెండు పార్టీల మధ్య వైరానికి దారితీస్తోంది. ఇప్పటికే రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని

Jayaprakash Narayana:చంద్రబాబు, కేసీఆర్ హయాంలో ఇలా జరగలేదు.. జగన్‌ పాలనపై జేపీ కామెంట్స్..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Election Schedule:ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై క్లారిటీ.. అప్పుడే పోలింగ్..!

లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది.