‘పవర్ స్టార్’కి లైక్ కొట్టి.. ప్రామిస్.. పొరపాటున జరిగిందన్నబండ్ల గణేష్

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నోరు జారడం కొత్తేమీ కాదు.. ఈసారి కొత్తగా చెయ్యి జారి సారీ చెప్పారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పవన్ కథతో 'పవర్‌స్టార్' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో వర్మ తీసుకున్న క్యారెక్టర్లకు తగ్గ వ్యక్తులనే సెలక్ట్ చేసుకున్నారు. అలాగే బండ్ల గణేష్‌ను పోలిన వ్యక్తిని ఈ సినిమా కోసం వర్మ తీసుకున్నారు.

అయితే వర్మ ఇటీవల విడుదల చేసిన ‘పవర్ స్టార్’ ట్రైలర్‌లో బండ్ల గణేష్‌కు, పవన్‌కు మధ్య జరిగిన సంభాషణ తాలూకు క్లిప్‌ని ట్విట్టర్‌లో ‘ఆర్‌ దే బ్రదర్స్’ అని ప్రశ్నిస్తూ షేర్ చేశారు. దీనికి బండ్ల గణేష్ లైక్ కొట్టారు. దీనికి ఓ అభిమాని ‘ఎందుకు లైక్ చేసినవ్ బండ్లన్న?’ అని ప్రశ్నించాడు. అది చూసిన బండ్ల గణేష్.. ‘ప్రామిస్.. ఏదో పొరపాటున జరిగింది. మరింకెప్పుడూ అలా చేయను. నేనేంటో నాకు తెలుసు. వెరీ వెరీ సారీ’ అని రిప్లై ఇచ్చారు.