Bandla Ganesh : రాహుల్ పాదయాత్రపై బండ్ల గణేష్ మార్క్ ట్వీట్... అభిమానం చూపించేశాడుగా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
పేరుకు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే అయినా సమకాలిన అంశాలపై కామెంట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం నిర్మాత బండ్ల గణేశ్‌కు అలవాటుగా మారింది. దీనిపై ఎన్ని విమర్శలు ఎదురైనా ఆయన మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ఏమైనా అంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే ఒంటికాలిపై లేస్తారు బండ్ల గణేష్. తాజాగా ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ శ్రీరాముడుకి తప్పలేదు అరణ్యవాసం ... పాండవులకీ తప్పలేదు అజ్ఞాతవాసం... కానీ ధర్మమే విజయం సాధించినది. నీకూ ఆ రోజు త్వరలోనే ఉంది’’ బండ్ల గణేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాహుల్ పాదయాత్ర సక్సెస్ అవుతుందని.. ఆయన దేశానికి ప్రధాని అవుతారన్న అర్ధం వచ్చేలా బండ్ల ట్వీట్ చేయడం గమనార్హం.
కేసీఆర్‌ను పొగుడుతూ బండ్ల గణేష్ ట్వీట్ .. ట్రోలింగ్ :
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ జరగాల్సిన బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పుడు కూడా బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఐ లవ్ యూ కేసీఆర్ సార్. మీరు టైగర్’’ అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని, అందుకే కేసీఆర్ ఇలా బ్రహ్మాస్త్రంను టార్గెట్ చేశారని సినీ, రాజకీయ జనాలు భావిస్తున్న వేళ బండ్ల గణేశ్ ట్వీట్ సంచలనం సృష్టించింది. ఈ ఈవెంట్ కోసం భారీగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు.. కార్యక్రమం రద్దయ్యిందని తెలియగానే భగ్గుమన్నారు. అలాంటి వేళ .. బండ్ల గణేశ్ ట్వీట్ వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. అయితే దీనిపై విమర్శలు రావడంతో గణేశ్ స్పందించారు. తాను కేసీఆర్‌ను ప్రేమిస్తున్నానని, ఆయన కంటే ఎక్కువగానే ఎన్టీఆర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఛానెల్ పెట్టే యోచనలో బండ్ల గణేష్:
మరోవైపు.. బండ్ల గణేశ్ టీవీ ఛానెల్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మా టీవీ వార్షికోత్సవం సందర్భంగా బండ్ల గణేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీరు కూడా ఓ ఛానెల్ పెట్టొచ్చు కదా అని కోరాడు. దానికి బండ్ల గణేష్ అదే ప్లానింగ్‌లో వున్నాను బ్రో అంటూ బదులిచ్చాడు.
శ్రీరాముడు కి తప్పలేదు అరణ్యవాసం పాండవుల కీ తప్పలేదు అజ్ఞాతవాసం కానీ ధర్మమే విజయం సాధించినది నీకూ ఆ రోజు త్వరలోనే ఉంది ?? @INCTelangana @INCIndia @RahulGandhi pic.twitter.com/vS0PhFnMGW
— BANDLA GANESH. (@ganeshbandla) September 10, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout