Bandla Ganesh:తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలైంది.. అందరి నోట కాంగ్రెస్ మాటే: బండ్ల గణేష్

  • IndiaGlitz, [Wednesday,November 08 2023]

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు రెడీ అయ్యారని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తెలిపారు. నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. షాద్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి, తన మిత్రుడు వీరపల్లి శంకర్ నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లానని.. జనాలు తండోపతండాలుగా వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని.. ఎక్కడ చూసినా కాంగ్రెస్ మాటే వినిపిస్తోందన్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని వ్యాఖ్యానించారు.

సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసింది ఎవరు..? తెలంగాణ ఇచ్చింది ఎవరు..? దేశం కోసం రాజీవ్ గాంధీ శరీరం ముక్కలైతే.. రాహుల్ గాంధీ చిన్న వయసులో బాడీ ముక్కలు ఏరుకుని శ్మశానానికి వెళ్లారని బండ్ల భావోద్వేగానికి గురయ్యారు. ఎవరు పడితే వారు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని.. కానీ రాహుల్ ఏనాడూ హద్దు దాటి మాట్లాడలేదని తెలిపారు.

కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారని.. అహంకారం తలకెక్కిన వారందరికీ నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరగే తీర్పు ఇవ్వనున్నారని వివరించారు. తన శ్వాస.. తన ధ్యాస.. కాంగ్రెస్ అని.. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌కే ఓటు వేశా.. కాంగ్రెస్‌లోనే చస్తానన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ కార్యకర్తను తాను అని పేర్కొన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ముఖ్యం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తనకు ముఖ్యమని బండ్ల వెల్లడించారు.

More News

Prime Minister Modi:బిహార్ సీఎం నితీశ్ కుమార్ 'సెక్స్' వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Vande Sadharan Express:‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ట్రయల్ రైన్ సక్సెస్.. త్వరలోనే ప్రయాణికులకు అంబాటులోకి..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పడబోతుంది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తీసుకొస్తు్న్న ‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Vande Sadharan express)

YS Jagan: ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణపై కోర్టు్ల్లో కదలిక మొదలైంది.

Vijayashanthi: రాములమ్మను బీజేపీ పక్కన పెట్టేసినట్టేనా..? పొమ్మనలేక పొగబెడుతున్నారా..?

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్నాయి. బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు ప్రచారం చేశారు.

Jana Sena, BJP:తెలంగాణలో కమలంతో జనసేన దోస్తీ.. మరి ఏపీలో పరిస్థితేంటి..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నగారా మోగి ప్రచారం హోరెత్తుతుండగా..