పవనొక వ్యసనం.. చనిపోయి బూడిదయ్యే వరకూ వదల్లేం: బండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి నిర్మాత బండ్ల గణేశ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి బండ్ల గణేష్ చాటుకున్నారు. మొదటు పెట్టడమే.. ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన బండ్ల ఆ తరువాత మరింత రెచ్చిపోయి మారి మాట్లాడారు. పవన్ ఒక వ్యసనమని.. ఒకసారి అలవాటు చేసుకుంటే బూడిదయ్యే వరకూ మనం వదల్లేమని వెల్లడించారు.
‘‘నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే.. చనిపోయి బూడిద అయ్యే వరకూ మనం వదల్లేం. హీరో గురించి మాట్లాడాలంటే.. ఓ ఐపీఎస్ వద్దకు వెళ్లి మీరు టెన్త్ క్లాస్ బాగా పాస్ అయ్యారు అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, చరిత్రలు లేవు. ఆయన కొత్త శకం, కొత్త నాందికి శ్రీకారం చుట్టాడు. నన్ను ఒక స్నేహితుడు ‘మీ బాస్ ఎందిరా ఓసారి సినిమాలు, మరోసారి రాజకీయాలు అంటాడు’ అని అడిగాడు. నేను అతనితో చెప్పా.. ఆయనది మనలా కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం ఆయనకు లేవు కదా.. ఆయన ఆయనకి ఉన్నదిల్లా బ్లెడ్ వ్యాపారం.. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి.. ఆ చెమటను నటనగా మార్చి దాన్ని జనానికి అందించే వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పాను.
ఊరికే ఎవరూ గొప్పవాళ్లు కారు. ఎందరో పుడుతుంటారు.. చనిపోతుంటారు. కానీ కొందరే చరిత్రలో ఉంటారు. రోజుకి 18 గంటలు పని చేస్తూ.. సినిమా వెనుక సినిమా చేస్తూ.. ప్రత్యేక్షంగా 1200 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. నేను చాలాసార్లు ఆయనకు అబద్ధం చెప్పి మోసం చేద్దామని అనుకున్నా. కానీ ఆయన కళ్లలోకి చూసిన వెంటనే అలా చేయడం నా వల్ల కాదు. అయన కళ్లలో అంత నిజాయతీ ఉంటుంది. వెంకన్నకు అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటున్నాను’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout