డేగల బాబ్జీ ట్రైలర్ : సింగిల్ లొకేషన్, సింగిల్ యాక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ... బండ్ల గణేష్ విశ్వరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్‌గా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చి తర్వాత నిర్మాతగా సత్తా చాటారు బండ్ల గణేష్. అనంతరం రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ వేసి ఎందుకో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీపై ఈగ వాలనివ్వని బండ్ల గణేశ్.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తూ వుంటారు. తాజాగా ఆయన హీరో అవతారమెత్తారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ సినిమాకి తెలుగు రీమేక్‌గా బండ్ల గణేశ్ నటించిన చిత్రం ‘‘ డేగల బాబ్జీ ’’. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. తాజాగా సోమవారం డేగల బాబ్జీ ట్రైలర్ విడుదల చేసి మేకర్స్.
2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో బండ్ల గణేష్ నటనలో సీనియారిటీతో పాటు ఎంతో మెచ్యూరిటీ కనిపించింది. సింగిల్ లొకేషన్, సింగిల్ యాక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒకే వ్యక్తి కనిపించడం తెలుగు తెరపై ఇదే తొలిసారి అని తెలుపుతూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక హత్య కేసులో నిందితుడైన డేగల బాబ్జీ.. అసలు ఆ హత్యను తానెందుకు చేయాల్సి వచ్చిందో చెప్పడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. అలా డిఫరెంట్ సన్నివేశాల్లో, డిఫరెంట్ కోణాల్లో బండ్ల గణేష్ ఆకట్టుకున్నారు.
తనదైన మాడ్యూలేషన్స్‌తో ఆయన చెప్పిన డైలాగ్స్, కథకు తగ్గట్లుగా కనబర్చిన ఎమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ''పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం, అసలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా?'' అంటూ బండ్ల గణేశ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 'బావా... నేను ఎక్కడ ఉన్నానో పట్టుకో చూద్దాం! ఎందుకు బావా ఆ దేవుడు మనల్ని పేదోళ్లుగా పుట్టించాడు. పవన్‌ని జాగ్రత్తగా చేసుకుంటావా?' అని ట్రైలర్ మధ్య మధ్యలో ఫిమేల్ వాయిస్‌లో డైలాగులు వినిపించాయి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments