బండ్ల గణేష్ కూతురు చేతుల మీదుగా విడుదలైన 'డేగల బాబ్జీ' లోని "కలలే కన్నానే.." లిరికల్ వీడియో

  • IndiaGlitz, [Thursday,February 03 2022]

ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు.తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన ఉత్త సిరుప్పు సైజు 7 చిత్రాన్ని తెలుగులో .ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసున్న చిత్రమే 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్ సైతం ప్రేక్షకులనుండి ఎంతో ఆధరణ లభించింది.ఇప్పుడు ఈ చిత్రం లోని లిరికల్ వీడియో ను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి విడుదల చేసారు.

కలలే కన్నానే.. కలగా మిగిలేనే..
కథగా మారిందే..ఎదలోని వ్యధలే..
నను లోకువ చేసి దోబూచులాడిందే..
రారూ.. నీతో ఎవరూ.. చివరకు మిగిలే నీడే ..నీవు.
విధి రాతలే.. విలపించిన కడలల్లే..ఎగసి పడు...
ఈ లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ పాటకు అభయ్ జోధ్ పుర్కర్ ఆలపించారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. తమిళ్ లో పార్థీబన్ చేసిన ఉత్త సిరుప్పు సైజు 7 నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాను తీసుకున్నాను అని నా మిత్రుడు వెంకట్ చంద్ర చెప్పడం జరిగింది.తనతో నాకు 20 సంవత్సరాల స్నేహం.తెలుగులో స్టార్ హీరోలు ఎవరు చేసినా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను.అయితే అనూహ్యంగా ఈ సినిమాలో నన్ను నటించమని చెపితే..నేను యాక్ట్ చేయడమేమిటి..నేను యాక్టింగ్ మర్చిపోయాను.తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ నేను చేయలేను.. అయినా నేనిప్పుడు సినిమా తీద్దామను కుంటున్నాను యాక్ట్ చేయనని చెప్పాను.అయితే కథ చాలా బాగుందని చెబుతూ నన్ను కన్విన్స్ చేయడంతో.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్.అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు. సినిమా చేసే వరకు నాలో గుండె దడ దడ కొట్టుకునేది, భయమేసేది. సినిమా చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత చూసుకున్న నేనే అక్షర్యపోయాను. నేనేనా ఇలా యాక్ట్ చేసింది అని నాలో నాకే ఆనందంవేసింది.నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు అనుకున్నాను. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత హాయిగా కాలరెగరేసి తృప్తిగా ఉన్నానో..నేను చచ్చిపోయిన తరువాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో. ఈ డేగల బాబ్జి చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది.ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సాంగ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది.లైనస్ అద్భుతమైన మ్యూజిక్,రీ రికార్డింగ్ ఇచ్చాడు.ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ కళ్లార్పకుండా చూస్తారు. అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా..బండ్ల గణేష్ అనే వ్యక్తి ఇంత బాగా చేస్తాడా అనే రెస్పెక్ట్ ఈ సినిమా తర్వాత వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా ఇది. ఇది భవిష్యత్తులో నేను యాక్ట్ చేస్తానో లేదో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా నా జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాను. చంద్ర వెంకట్ తెలుగు ఇండస్ట్రీ లో మరో గొప్ప దర్శకుడు అవుతాడు. ఒక రీమేక్ ని అద్భుతంగా మలచి ఇచ్చాడు. ఒక పూరి జగన్నాథ్ లాగా కన్ఫ్యూజన్ లేకుండా స్పీడ్ గా చేశాడు. అద్భుతమైన డైరెక్టర్ కు వుండే లక్షణాలు అన్నీ తనకు ఉన్నాయి.ఒక నేషనల్ అవార్డు వచ్జిన ఈ సినిమాను తెలుగులో చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ.. ఆ సినిమాను తీసుకొని నాతో యాక్ట్ చేయించడం ఒక ఎత్తు.కచ్చితంగా ఈ సినిమాను జనాలు నీరాజనాలు పడతారు. మీరందరూ ఈ సినిమాను విపరీతంగా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను ఈ సాంగ్ తర్వాత ఆశీర్వచనాలు, ఆశీస్సులు మీ అప్లాజ్ నన్ను ఎంతో ముందుకు నడిపిస్తాయి. ఈ సినిమాను మా బాస్ తో ఓపెన్ చేయిద్దాం అన్నారు. కోవిడ్ సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు వారందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు మెండుగా ఉంటాయని వద్దన్నాను. అలాగే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క హీరో ఆశీస్సులు, దర్శకుల ఆశీస్సులు తెలుగు ప్రేక్షకుల అభిమానం నాపై నాకు ఎప్పుడూ ఉంటాయి.ఈ రోజు దేవత లాంటి పసిబిడ్డ ద్రిష్టి తో ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నాం.త్వరలో వస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ అందరి అభిమానం పొందుతూ ఈ సినిమా దర్శకుడికి,నాకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు

దర్శకుడు వెంకట్ చందర్ గారు మాట్లాడుతూ ..ఈ సినిమాను ఓటిటిటీలో చూసి తీసుకోవడం జరిగింది. ఆ సినిమా తీసుకున్న తర్వాత ఎవరి నీతో చేయాలి అనుకున్న టైంలో నాకు 20 సంవత్సరాలు ఫ్రెండ్ గా ఉన్న బండ్ల గణేష్ గారు గుర్తొచ్చారు. తన గురించి నాకు బాగా తెలుసు తను ఎమోషనల్గా ఎలా ఉంటాడు అనేది నాకు పర్సనల్ గా తెలుసు .ఈ సినిమాకు కావలసిన ఎమోషన్ తనలో ఉందని తెలిసి తనతో ఈ సినిమా చేస్తున్నాను. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఏ రేంజ్ పర్సన్,ఎలా యాక్ట్ చేశాడు అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారు.లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.త్వరలో వస్తున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు లైనస్ మధిరి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈరోజు రాబోతున్న ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.ఇందులో బండ్ల గణేష్ చాలా విలక్షణమైన నటనతో అద్భుతమైనటువంటి నటనను కనపరిచాడు.మేం చేసిన కష్టానికి ప్రేక్షకులు మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుతున్నాను.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), కళా దర్శకత్వం: గాంధీ, కూర్పు: ఎస్.బి. ఉద్దవ్, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, కథ: ఆర్. పార్తిబన్, మాటలు: మరుధూరి రాజా, వైదేహి, సంగీతం: లైనస్ మధిరి, సమర్పణ: రిషి అగస్త్య, నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్ దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.

More News

కాజల్‌కు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ

సినీ నటి కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత అరుదుగా, కొందరు ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం కాజల్ అగర్వాల్‌కు అందజేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ..

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

యూపీ ఎన్నికల ప్రచారంలో వున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోను తడుముతూ బన్నీ భావోద్వేగం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది.

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న 'సెబాస్టియన్' పి.సి.524

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై "యస్.ఆర్. కళ్యాణమండపం" సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను

సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే 'సెహరి' ప్రపంచంలోకి వెళ్తారు - దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక.